వామ్మో.. కౌశల్ ఆర్మీని చూశారా..! ఎంత మంది ఉన్నారో..!

-

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ ఎవరు ? అని అడిగితే.. కౌశల్.. అని ఠక్కున సమాధానం వస్తుంది. అవును మరి, అంతలా కౌశల్‌కు ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. బిగ్‌బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుంచి ఇంటి సభ్యులంతా ఏదో ఒక రకంగా కౌశల్ తో గొడవ పడుతూనే ఉన్నారు. ఒక్క నూతన్ నాయుడు మాత్రమే కౌశల్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరూ కౌశల్‌ను దూరంగా ఉంచడం మొదలు పెట్టారు. అయితే దీని ప్రభావమో, మరొకటో తెలియదు కానీ, కౌశల్‌ను సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులు అతనికి ఏర్పడ్డారు.

కౌశల్‌కు సపోర్ట్ ఎంతలా పెరిగిందంటే.. సోషల్ మీడియాలో ఏకంగా కౌశల్ ఆర్మీ పేరిట ఒక గ్రూప్ కూడా ఏర్పాటైంది. వీరంతా కౌశల్‌ను గట్టిగా సపోర్ట్ చేస్తుండడంతో, ప్రతివారం ఎలిమినేషన్‌లో అతను నామినేట్ అవుతున్నప్పటికీ అతని ఫ్యాన్స్, కౌశల్ ఆర్మీ వల్ల కౌశల్ బతికిపోతున్నాడు. ఇక ఈ సీజన్ ముగింపుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో హీట్ మరింత పెరిగింది.

ఇప్పటికే కౌశల్ ఈ సీజన్ మొత్తానికి ఎలిమినేషన్ల కోసం నామినేట్ అవడంతో కౌశల్‌ను రక్షించడానికి కౌశల్ ఆర్మీ గట్టిగానే పనిచేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కౌశల్ ఆర్మీ గ్రూప్ 2కె రన్, ర్యాలీ నిర్వహించింది. అందులో భారీ ఎత్తున కౌశల్ అభిమానులు పాల్గొనడం విశేషం. ఒక హైదరాబాద్ నగరంలోనే ఇంత పెద్ద ఎత్తున కౌశల్‌కు సపోర్ట్ చేస్తున్నారంటే.. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి కౌశల్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా కౌశల్ ఆర్మీ తొలిసారిగా బయటికి వచ్చి తమ సపోర్ట్‌ను ప్రదర్శించడం కౌశల్‌కు కొంత ఊరటనిచ్చే విషయం. మరి కౌశల్‌ను మిగిలిన ఎలిమినేషన్ల నుంచి కూడా కాపాడి అతన్ని అతని అభిమానులు బిగ్‌బాస్ 2 విన్నర్‌గా నిలుపుతారా, లేదా అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news