KrishnaVrindaVihari : “కృష్ణ వ్రింద విహారి” అంటూ వచ్చేసిన నాగశౌర్య

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డజన్‌ కు పైగా సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు హిట్‌ కాగా మరికొన్ని ఫట్టాయ్యాయి. దీంతో స్టార్‌ డమ్‌ కోసం హీరో నాగ శౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో లక్ష్య చిత్రం చూస్తేనే తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా.. ఇవాళ తన బర్త్‌ డే జరుపుకుంటున్నాడు నాగశౌర్య. ఈ నేపథ్యంలో మరో సినిమాను అనౌన్స్‌ చేశాడు. “కృష్ణ వ్రిద్ధ విహారి” అనే డిఫరెంట్‌ టైటిల్‌ తో వచ్చేశాడు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. కాగా.. ఈ సినిమాకు ఉషా ములంపూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి స్వర సాగర్‌ ఈ సినిమా కు సంగతీ స్వరాలు అందించనున్నాడు. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news