రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో మహేష్ సూపర్ స్టార్ – కృతిశెట్టి

-

కృతి శెట్టి.. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన కృతి శెట్టి పలు యాడ్స్ లో కూడా నటించింది. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్నడ ఇండస్ట్రీకి చెందినది.. ఉప్పెన సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక డెబ్యూ మూవీతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి సొంతం చేసుకోవడం జరిగింది.

అయితే వరుస హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడంతో కథల ఎంపిక విషయంలో కాస్త వెనకడుగు వేసిందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోని చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ తో కలిసి ది వారియర్ చిత్రంలో నటించినది. అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోకపోగా డిజాస్టర్ ను మూటగట్టింది. తర్వాత మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నితిన్ సరసన నటించినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

ఇది ఇలా ఉండగా తాజాగా టాలీవుడ్ సహా తమిళ్ లో భారీ స్టార్ డం ఉన్న సూపర్ స్టార్ మహేష్ మరియు ఇళయ దళపతి విజయ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి. తన ఫాలోవర్స్ మహేష్ బాబు కోసం అడగగా ఆయన రీల్ లైఫ్ లోను అలాగే రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని చెప్పింది కృతి. అంతే కాకుండా విజయ్ కూడా ఒక ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్ అంటూ తెలిపింది. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ పై ఒకేలాంటి కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news