అన్నదాతలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా మూడు వేలు..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని అన్నదాతలకు అందిస్తోంది. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులు అదిరే లాభాలను పొందొచ్చు. పూర్తి వివరాలను చూస్తే.. ఈ స్కీమ్ నుంచి లక్షలాది మంది రైతులు లాభాలను పొందొచ్చు.

farmers

60 ఏళ్లు దాటిన తర్వాత రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ని ఈ స్కీమ్ ఇస్తోంది. దీనితో వయసు మళ్లిన రైతులకి సపోర్ట్ అందుతోంది. స్కీమ్ వివరాలను చూస్తే.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన రైతులు దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు. 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ని తీసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ.36 వేలను అందిస్తుంది.

ఈ స్కీమ్ లో రైతులు రిజిస్ట్రేషన్ అయ్యాక వయసును బట్టి రైతులు ప్రతి నెలా కొంత మేర ప్రీమియాన్ని చెల్లించాలి. ఇది రైతుల వయస్సు బట్టీ ఉంటుంది. ఈ స్కీమ్ లో నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది చూద్దాం.

దీని కోసం ముందు సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
మీ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో పాటుగా ఆదాయ సర్టిఫికేట్‌ను కూడా సబ్మిట్ చెయ్యాలి.
అలానే బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా ఇవ్వాలి.
తరవాత ఆధార్‌తో లింక్ చేసుకునే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు.
తర్వాత ప్రాసెస్ పూర్తవుతుంది.
పెన్షన్ నెంబర్, పెన్షన్ కార్డు వస్తుంది.
మీరు maandhan.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.
1800267 6888 టోల్ నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news