బీఆర్ఎస్ నేతల మధ్య ఆత్మీయ బంధం బలోపేతమవ్వాలి : కేటీఆర్

-

బీఆర్ఎస్ నాయకులందరి మధ్య ఆత్మీయ అనుబంధం బలోపేతం కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని ఎమ్మెల్యేలు.. పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని ఆదేశించారు.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.
పట్టణాల్లో అయితే ఒక్కో పట్టణం అనే విధంగా, పెద్ద నగరాల్లో అయితే డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ తెలిపారు. వీటికి స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను.. కార్పొరేషన్ ఛైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని పేర్కొన్నారు. వీటిని రెండు నెలల్లోపు పూర్తి చేయాలని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version