తప్పు చేస్తే చీల్చిచెండాడండి.. మంచి చేస్తే ప్రజలకు చెప్పండి : కేటీఆర్

-

మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు.. అని మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళా కెమెరామెన్‌, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవని తెలిపారు. మహిళల కోసం వీహబ్‌ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నారని వెల్లడించారు. మీడియా రిలేటెడ్‌ స్టార్టప్‌ పనులు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుందని వివరించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… మహిళా జర్నలిస్టులకు సూచనలు చేశారు. ప్రభుత్వం తరఫున సత్కారం అందుకున్న మహిళలకు అభినందనలు తెలిపారు.

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండని మహిళా జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ సూచించారు. దాంతో పాటు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version