డిసెంబర్ 3 తర్వాత కోడళ్లకు సీఎం కేసీఆర్ ఓ శుభవార్త చెబుతారు : కేటీఆర్‌

-

తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అధికార ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో గెలిచిన తర్వాత తెలంగాణా కోడళ్ళకు, అత్తలకు శుభవార్త చెప్తానని పేర్కొన్నారు. అందరికీ ఏదో ఒకటి ఇచ్చారు కానీ మాకేమీ ఇవ్వలేదని కోడళ్ళు మా మీద అలిగారని, గెలవగానే కోడళ్ళకు శుభవార్త చెప్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేస్తామన్నారు. నెలకు రూ.3వేలు మీ ఖాతాల్లో వేస్తామన్నారు. ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి జాన్సన్‌తో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసే ప్రతి ఓటు కేసీఆర్‌కు వేసినట్లుగా భావించాలన్నారు.

Blatant lies': BRS leader KTR hits back at Amit Shah after his speech at  Adilabad rally | Hyderabad News – India TV

తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, ఇలాంటి రాష్ట్రాన్ని ఇతరుల చేతుల్లో పెడితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి వస్తున్నారని, వారిద్దరి అజెండా… కేసీఆర్ గొంతు నొక్కడమే అన్నారు. ఎంతమంది వచ్చినా బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రజల మీదే భారం వేసిందన్నారు. గతంలో కంటే ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్నామని, అది కూడా గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఇస్తున్నామన్నారు. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మన డబ్బులు మనం తీసుకుంటున్నామన్నారు. ఇదివరకు సర్కార్ దవాఖానాకు వెళ్లను బాబోయే అనేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news