కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఒకరోజు వాయిదా పడింది. నిజానికి ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు అమిత్ షా చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం 10.30 గంటలకు సోమాజీగూడలోని హోటల్ క్షత్రయలో ఆయన బీజేపీ మ్యానిఫేస్టోను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా నేటి రాత్రికి హైదరాబాద్‌కు రావడం లేదు. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ేచేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కి రానున్న అమిత్ షా అక్కి నుంచి నేరుగా రేపు గద్వాల, నల్లగొండ, వరంగల్ సభల్లో పాల్గొననున్నారు. రేపు సాయత్రం 6.10 గంటలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
మూడు సకల జనుల విజయ సంకల్ప సభల అనంతరం అమిత్ షా నేరుగా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు అన్ని అనుబంధ విభాగాలతో నిర్వహించే జాతీయ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశాల అనంతరం అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్తారు.