తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ… కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఇందులో భాగంగా.. నేడు కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్ షో, సభల్లో కేటీఆర్ ప్రసంగించనున్నారు. కూకటిపల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు.
షెడ్యూలు వివరాలు..
సాయంత్రం కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్, బాలానగర్ శోభన సెంటర్, బోయిన్‌పల్లి, హస్మత్‌పేట క్రాస్ రోడ్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ ప్రసగించనున్నారు. ఆ తర్వాత కుత్భుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందతో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. సుచిత్ర, జేడీఎం ఇండస్ట్రీయల్ ఏరియా మీదుగా సాయంత్రం 6 గంటల వరకు షాపూర్ నగర్‌కు మంత్రి కేటీఆర్ రోడ్ షో జరగనుంది. రోడ్ షోల అనంతరం షాపూర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.