హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో దారుణం చోటు చేసుకున్నది. బుధవారం రాత్రి ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన సాలర్ జంగ్ మ్యూజియం వద్ద చోటు చేసుకున్నది. మ్యూజియం ఎదుట ఉన్న ఆటో స్టాండ్ వద్ద ఖురేషి, అబ్దుల్ ఖాజా అనే ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో ఖురేషి అనే వ్యక్తి ఆవేశంతో మటన్ కత్తిని తీసుకొచ్చి ఆవేశంతో అబ్దుల్ ఖాజా గొంతు కోశాడు. కడుపులో పలు మార్లు పొడిచాడు. గొర్రెను కోసినట్టు అబ్దుల్ ఖాజా గొంతును కోశాడు. దీంతో అబ్దుల్ ఖాజా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.