ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్.. విచారణ ప్రారంభం..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది సేపటి కిందటే బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్ రావు, గన్ మేన్ తో కేటీఆర్ లోపలికి వెళ్లారు. విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్ వరకు లాయర్ ను అనుమతించారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

న్యాయవాదికి విచారణ అధికారులు కనిపించేవిధంగా ఏర్పాట్లు చేశారు. అరవింద్ కుమార్ తో పాటు దాన కిషోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఏసీబీ డైరెక్టర్, డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. హెచ్ఎండీఏ నుంచి FTA కు రూ.55కోట్ల నిధుల బదిలీ పై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version