ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని ఇలా ఈజీగా మార్చుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన చాలా లాభాలు వున్నాయి. ఆధార్ కార్డు లేకపోతే స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ వరకు ఎన్నో పనులు నిలిచిపోతాయి. అయితే ఆధార్ కార్డును తీసుకునే ముందు మొబైల్ నెంబర్‌ను కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

చాలా సార్లు మొబైల్ నెంబర్‌ను మారుస్తూ ఉంటాము. అలాంటప్పుడు సమస్య లేకుండా ఆ మొబైల్ నెంబర్ తో ఆధార్ ఉండేలా చూసుకోవాలి. అయితే మరి నెంబర్ ని ఎలా మార్చాలి..? ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీరు ఇంట్లోనే కూర్చుని ఆధార్‌ లో మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకో వచ్చు. దీని కోసం మొదట మీరు యూఐడీఏఐ పోర్టల్ Ask.uidai.gov.inకి వెళ్లాల్సి ఉంటుంది.

దీనిలో మీరు మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. నెంబర్ అప్‌డేట్ కావాలంటే మీ పాత మొబైల్ నెంబర్ కూడా సర్వీసులో ఉండాలి. అప్పుడే అవుతుంది. మొబైల్ నెంబర్ సర్వీసులో లేకపోతే.. మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్లి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలి. ఇంట్లో చెయ్యడం అవ్వదు. మీరు కొత్త నెంబర్ తీసుకుంటే.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా బేస్ లో అప్డేట్ చేసుకోవడం అవసరం.

ఆధార్ సెంటర్ లో ఎలా మొబైల్ నెంబర్ మార్చుకోవాలి..?

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ అప్‌డేట్ లేదా కరెక్షన్ ఫామ్ తీసుకుని ఆ దరఖాస్తును నింపాలి.
దరఖాస్తును ఇచ్చేసి రూ.50 ఫీజును చెల్లించాలి.
అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్(యూఆర్ఎన్)తో మీకు ఒక రశీదు ఇస్తారు.
దీనితో మీరు ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
90 రోజుల్లో నెంబర్ అప్‌డేట్ అవుతుంది అంతే.

Read more RELATED
Recommended to you

Latest news