సమంత పిటీషన్ పై కూకట్ పల్లి కోర్ట్ బిగ్ ట్విస్ట్ !

-

యూట్యూబ్ ఛానల్ ఛానళ్ల పై టాలీవుడ్ హీరోయిన్ సమంత వేసిన పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్ పల్లి కోర్టు. ఇవాల్టి కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని కూకట్పల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇక అంతగా.. సమంత తరపు న్యాయవాది వాదన విన్న కోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

తప్పు జరిగిందని భావిస్తే….పరువునష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కొరొచ్చు కదా ఆని ప్రశ్నించింది కోర్టు. సెలబ్రిటీ ల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని తెలిపింది.కోర్టు ముందు సెలబ్రిటీలు మరియు మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.

సమంత  విడాకులు ఇంకా తీసుకోలేదు… ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పేర్కొన్నారు. సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు…ఆమెకు అక్రమ సంబంధాలు అంతగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా …పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు సమంత తరఫు న్యాయవాది. కోర్టు ముందు సెలబ్రిటీలు మరియు మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news