కోడెల కోటలో కుమ్ములాటలు..బాబు సీటు తేల్చు?

-

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది…కోడెల శివప్రసాద్ చనిపోయాక ఇక్కడ టీడీపీ బాధ్యతలు ఎవరికి దక్కలేదు…అయితే ఈ సీటు దక్కించుకోవడం కోసం పలువురు టీడీపీ నేతలు లైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు సత్తెనపల్లిలో సెపరేట్‌గా రాజకీయం నడిపిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది…అసలు ఈ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది.

TDP
TDP

కోడెల చనిపోయాక ఈ సీటు కోడెల శివరాంకు దక్కుతుందని అంతా అనుకున్నారు. ఎలాగో కోడెల వారసుడు కాబట్టి శివరాంకే సీటు ఫిక్స్ అవుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే శివరాం యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ సత్తెనపల్లిలో శివరాంని వ్యతిరేకించి తమ్ముళ్ళు కూడా ఉన్నారు…వారు శివరాంకు సీటు ఇవ్వడానికి అసలు ఒప్పుకోవడం లేదు. అయితే వారిని ఎలాగోలా ఒప్పించి సీటు దక్కించుకోవాలని శివరాం చూస్తున్నారు.

ఇక శివరాంతో పాటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ సైతం సత్తెనపల్లి సీటుపై కన్నేసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం సత్తెనపల్లి సీటు దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన వర్గంతో కలిసి నియోజకవర్గంలో హడావిడిగా తిరుగుతున్నారు…అటు నరసాపురం పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు నాగోతు శౌరయ్య సైతం సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. ఇలా ఎవరికి వారు సీటు కోసమని చెప్పి…నియోజకవర్గంలో సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు పెడుతూ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే సత్తెనపల్లి నేతలకు టీడీపీ అధిష్టానం నుంచి వార్నింగ్ వెళ్లింది…ఎవరు ఏ కార్యక్రమం చేసినా సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్‌లోనే చేయాలని, ప్రెస్ మీట్లు అక్కడే పెట్టాలని …అలా కాకుండా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్‌లు కంటే సత్తెనపల్లి సీటు ఫిక్స్ చేస్తే బెటర్ అని తమ్ముళ్ళు అంటున్నారు. చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. త్వరగా సత్తెనపల్లి ఇంచార్జ్ ఫిక్స్ చేయాలని కోరుతున్నారు. మరి చూడాలి బాబు..సత్తెనపల్లి సీటు ఎప్పుడు ఫిక్స్ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news