కర్నూలు : రోడ్డు ప్రమాదంతో మంచానికే పరిమితమైన ప్రియుడు…ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..!

ప్రేమ పేరుతో చెక్కర్లు కొట్టడం ఆ తరవాత ఎవరికి నచ్చినవాళ్లను వాళ్ళు పెళ్లి చేసుకోవడం. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రేమ కథలన్నీ ఇలాంటివే. కానీ ఈ ఘటన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తాను ప్రేమించిన వాడు రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయినా అతడినే పెళ్లాడింది యువతి. కర్నూలు కు చెందిన అనిల్..పవిత్ర అనే యువతి యువకులు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

love
love

అనిల్ కు 2016 లో కార్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం లో అతడి కాళ్ళు చచ్చుబడి పోగా మంచానికే పరిమితం అయ్యారు. అయితే పవిత్ర మాత్రం తన ఇంట్లో వాళ్ళు వద్దు అని వాదించినా వినకుండా అనిల్ ను పెళ్లి చేసుకుంటా అని పట్టు పట్టింది. అనిల్ కూడా పెళ్లికి నిరాకరించాడు. కానీ నాకు ఇలాంటి పరిస్థితే వేస్తే నువ్వు వదిలేసే వాడివా అని ప్రశ్నించింది. ఇద్దరూ ఈనెల 2న పోలీసులను ఆశ్రయించి 8న పెళ్లి చేసుకున్నారు. ఇక డిఈడీ చదివిన పవిత్ర నా భర్తను నేను పోషించుకుంటా అని చెబుతోంది.