ఏపీలో దారుణం : భర్త మర్మాంగంపై వేడి నీళ్లు పోసిన భార్య!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగం పై ఏకంగా వేడి నీళ్లు పోసింది భార్య. ఈ ఘటన పశ్చిమ గోదావరి ఏలూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదం తో నిద్రిస్తున్న భార్త పై వేడి వేడి నీళ్లు పోసింది భార్య.

police shook at visuals in kadapa gurralagadda incident

ఈ వేడి నీటిని మర్మాంగం పై కూడా పోవడం తో… అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమం గా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెండవ పట్టణ సీఐ ఆది ప్రసాద్ మరియు ఎస్సై కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్ లో టైలర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.