దమ్ముంటే రోజాది బయటపెట్టండి.. ఖుష్బూ సవాల్

-

టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై నటి ఖుష్బూ మరోసారి స్పందించారు. రోజాకు సంబంధించిన బ్లూఫిల్మ్ ఉందని బండారు చెప్పారని, అంటే ఆయన బ్లూ ఫిల్మ్ చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చునన్నారు. అయితే.. అలాంటి దిగజారుడు వ్యక్తి ఒక మహిళను అలా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు ఖుష్భూ. మొత్తంగా ఒక మనిషిగా ఆయన ఓడిపోయారని ఖుష్భూ మండిపడ్డారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మరోసారి తెలిపారు ఖుష్భూ.

Khushbu nominated as NCW member | Chennai News - Times of India

కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశంలో అన్నిచోట్లా రాజకీయాల్లో మహిళలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఖుష్భూ వ్యాఖ్యానించారు. ఒక మహిళ గురించి అంత అసహ్యంగా మాట్లాడి ముందుతరాల వారికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు ఖుష్భూ. మహిళల క్యారెక్టర్‌ను చంపేలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని ఖుష్భూ హితవు పలికారు. రోజా బ్లూఫిలిమ్స్ ఉన్నాయని చెప్పిన బండారు దమ్ముంటే ఆ వీడియోను రిలీజ్ చేయాలన్నారు ఖుష్భూ.

Read more RELATED
Recommended to you

Latest news