థ్యాంక్యూ చంద్రబాబు: జగన్ కచ్చితంగా చెప్పాల్సిన మాట ఇది!

-

ప్రతిపక్షాల విషయంలో ప్రతీ విషయాన్ని నెగిటివ్ కోణంలో చూడటం అధికార పక్షాలకు అలవాటు.. అది సహజం కూడా! కాని తెలిసో తెలియకో ఆ ప్రతిపక్షాలుచేసే కొన్ని పనులు ప్రభుత్వానికి పరోక్షంగా చాలా మేలే చేస్తాయి అనడానికి తాజా ఉదాహరణ ఇది! ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, అధికార వైసీపీ నాయకులు టీడీపీ కి థ్యాంక్స్ చెప్పాలి!

అవును… చంద్రబాబుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కచ్చితంగా కృతజ్ఞతలు తెలపాల్సిన సమయమిది! జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు ప్రారంభించాలని.. తద్వారా సుమారు 30లక్షల మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ సడన్ గా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఏపీ సర్కార్. దానికి గల కారణం.. చంద్రబాబు కోర్టుల్లో స్టే లు తేవడమే అని మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రకటించారు!

ఈ క్రమంలో నిజంగా జూలై 8న ఈ ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైపోయి ఉంటే… రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా జగన్ పై వ్యతిరేకత వచ్చేది! జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకీ వెలువడుతున్న వార్తలను గమనిస్తే… ఈ ఇళ్లపట్టాల విషయంలో అర్హులకు అందలేదనేది భారీ ఆరోపణ. ల్యాడ్ వాల్యూ అమాంతం పెంచేసిన వైకాపా నేతలు ఒక రేంజ్ లో అవినీతి చేశారన్న విషయం కాసేపు పక్కనపెడితే… నిజంగా కూడా అర్హులైన వారి పేర్లు ఈ పథకంలో నమోదు కాలేదు!!

దీంతో స్వయంగా వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులే జగన్ ను విమర్శించే పరిస్థితులో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నెలకొన్నాయి! “ఇళ్లపట్టాల అర్హ్తలు గుర్తించే విషయంలో పార్టీలతో సంబందం లేదు.. అర్హులైన అందరికీ ఇవ్వాలి, వారందరి పేర్లూ నమోదు చేయాలని” జగన్ సూచించినా కూడా… స్థానిక రాజకీయాలవల్ల, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వేలమంది పేర్లు ఈ పథకంలో నమోదు కాలేదనే చెప్పాలి! ఇది జగన్ దృష్టికి వెళ్లకో లేక సెంటిమెంట్ గా అనుకున్న రోజునే ప్రారంభించేయాలనే ఆతృతో తెలియదు కానీ… ప్రారంభించేయాలని నిర్ణయించారు!

ఇళ్ల పట్టాల పంపిణీకి సంబందించిన విషయంలో జరుగుతున్న దారుణాలు జగన్ వరకూ రానిపక్షంలో… ప్రభుత్వానికి, పార్టీకి చాలా ప్రమాధం! వచ్చినా కూడా జగన్ నిర్లక్ష్యం వహిస్తే.. ప్రజల దృష్టిలో జగన్ కు గత పాలకులకు పెద్ద తేడాలేదనేది సుస్పష్టం! ఈ తరుణంలో ఈ కార్యక్రమం వాయిదా పడటం అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి మంచి జరిగిందనే భావించాలి.

కాబట్టి.. సమయం ఉంది కాబట్టి.. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో జగన్ అతిశ్రద్ధ వహించి, వస్తోన్న ప్రతి ఫిర్యాదుపై స్పందించి.. వీలైనంత వరకూ కాదు.. నూటికి నూరుశాతం సమర్ధవంతంగా.. అవినీతి సంగతి దేవుడెరుగు.. కనీసం అర్హులైన వారికందరికీ ఇళ్లపట్టాలు అందిచేలా దృష్టి సారించడానికి ఇది అద్భుతమైన అవకాశం.. సువర్ణ సమయం! సో… కచ్చితంగా ఈ సమయంలో చంద్రబాబుకు జగన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news