ఓల్డ్ సిటీలో మహిళ వీరంగం..లేడీ కానిస్టేబుల్ పై దాడి..!

పాతబస్తీ లో ఓ మహిళ ఇద్దరు లేడీ కానిస్టేబుల్ లపై దాడికి పాల్పడింది. ఈ ఘటన వైరల్ గా మారింది. బహదూర్ పురా కు చెందిన ఓ మహిళ తన భర్త పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకి న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది. అనంతరం రోడ్డు పైకి వచ్చి వీరంగం సృష్టించింది. వెంటనే న్యాయం చేయాలంటూ రోడ్డు పై నిలుచుని అరవడం ప్రారంబించింది.

దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ లు మహిళను పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే పక్కకు తీసుకువెళుతున్న క్రమంలో మహిళ కానిస్టేబుల్ ల పైనే దాడికి పాల్పడింది. కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని గోడకు కొట్టింది. అక్కడి తో ఆగకుండా కాళ్ళతో తిడుతూ దూషించడం మొదలు పెట్టింది. అనంతరం మరికొంతమంది పోలీసులు చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.