పోస్ట్ లేట్ చేసినందుకు పోస్ట్ ఆఫీస్ కు లక్ష ఫైన్…!

-

పోస్టాఫీస్ కస్టమర్‌కు రిజిస్టర్డ్ పోస్ట్‌ను డెలివరీ చేయడంలో ఆలస్యం చేసినందుకు గానూ, రూ.లక్ష జరిమానాను ఎదుర్కొంది. ఈ పోస్ట్ ఆలస్యం చేయడంతో కస్టమర్ పరీక్షా రాయలేకపోయారు. ఎగ్జామ్ రాయడానికి రిజిస్టర్డ్ పోస్ట్‌లో కాల్ లెటర్ ఉండటం, ఆ కాల్ లెటర్ ఆలస్యంగా అందడంతో ఉద్యోగ కోసం రాసే పరీక్షను రాయలేకపోయాడు. కాల్ లెటర్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 2018 ఏప్రిల్ 6వ తేదీన పంపగా,

ఇది 14వ తేదీ కస్టమర్‌కు చేరాలి కాని,కస్టమర్‌కు ఈ రిజిస్టర్డ్ పోస్ట్‌ను 23వ తేదీ డెలివరీ చేసారు. డిస్‌ప్యాచ్ అయిన 17 రోజుల తర్వాత కస్టమర్‌కు చేరడంతో కస్టమర్ పోస్టాఫీస్‌పై డిస్ట్రిక్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేస్తూ, పోస్టల్ డిపార్ట్‌మెంట్ వల్ల నష్టం కలిగిందని, వారి అలసత్వం వల్ల జాబ్‌ పొందలేక పోయానని పేర్కొన్నాడు. ఫిర్యాదుపై స్పందించిన డిస్ట్రిక్ ఫోరమ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

రూ.30 రోజుల్లోగా ఈ పరిహారాన్ని కస్టమర్‌కు అందించాలని ఆదేశాలు జారి చేసింది. అయితే పోస్టల్ డిపార్ట్‌మెంట్ డిస్ట్రిక్ ఫోరమ్ తీర్పును సవాలు చేస్తూ, స్టేట్ కమిషన్‌‌ను ఆశ్రయించింది. స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ ఫోరమ్ ఆర్డర్‌ ని సమర్ధించింది. నేషనల్ కమిషన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ రివిజన్ పిటిజన్‌ను తోసి పుచ్చడమే కాకుండా, సేవల లోపం వల్ల కస్టమర్‌కు నష్టం కలిగిందని, సేవలను,

బాధ్యతలను, జవాబుదారీతనాన్ని మెరుగుపరుచుకోవాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు సూచించింది. డిస్ట్రిక్ ఫోరమ్ కన్సూమర్ లీగల్ ఎయిడ్ అకౌంట్‌లో రూ.లక్ష డిపాజిట్ చేయాలని, నాలుగు వారాల్లోగా డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ చెయ్యాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news