బాబు వ్యూహానికి జ‌గ‌న్ చిక్క‌లేదుగా…!

-

రాజ‌కీయాల్లో ఎత్తులు పైఎత్తులు కామ‌న్‌. అయితే, అవి ఒక‌ప్పుడు ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితంగా ఉండేవి. కానీ నేడు మారిన రాజ‌కీయాల్లో రోజుకో ఎత్తుతో విప‌క్షాలు, వాటిని చిత్తు చేస్తూ.. అధికార ప‌క్షం దూకుడు ప్ర‌ద‌ర్శి స్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో అధికార ప‌క్షానిదే పైచేయిగా మారింది. వాస్త‌వానికి ఏడు మా సాల పాల‌న‌లో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులే సంపాయించు కున్నారు. అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం త‌న ప‌ట్టును కోల్పోకుండా జ‌గ‌న్‌పై పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా అనేక వ్యూహాల‌తో ఉద్య‌మాలు చేస్తోంది.

ఇసుక నుంచి ప్రారంభించి అమ‌రావ‌తి రాజ‌ధాని వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం దూకుడుగా ముందుకు వెళ్తోం ది. అయితే, అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌జాద‌ర‌ణ సాధించుకున్న జ‌గ‌న్ స‌ర్కారును విఫ‌ల‌మైన ప్ర‌భు త్వంగా చిత్రీక‌రించాల‌న్న టీడీపీ అధినేత ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు బాబు వ్యూహం మాత్రం ఎప్ప‌టిక ప్పుడు విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తోంది. ఐదు నెల‌ల కింద‌టే ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై `అరాచ‌క‌`ముద్ర వేయాల‌ని భావించారు. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నారంటూ ఊరూవాడా ప్ర‌చారం చేశారు. గుంటూ రులోని ఆత్మ‌కూరు త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించి అక్క‌డ ఉద్య‌మాలు చేశారు. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యుల‌ను ఇక్క‌డ‌కు ర‌ప్పించారు.

అయితే, విప‌క్షాలు చెబుతున్న‌ట్టుగా ప‌రిస్థితి ఏమీ లేద‌ని, పోలీసులు బాగానే ప‌నిచేస్తున్నార‌ని, ప‌క్ష‌పాత ధోర‌ణి క‌నిపించ‌డం లేద‌ని మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యులు తేల్చేశారు. దీంతో చంద్ర‌బాబు ఆలోచించి ఆలోచించి అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని తీసుకున్నారు. దీనిద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి అరాచ‌క ము ద్ర వేయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌ను రంగంలోకి దింపి తీవ్ర వ్యాఖ్య‌లు చేయించా రు. ఇక‌, తాజాగా జ‌రిగిన ర‌హ‌దారుల దిగ్బంధ‌నం కార్య‌క్ర‌మాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి జ‌రిగింద‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. త‌ద్వారా పోలీసులు రెచ్చిపోయి లాఠీ చార్జీ చేసి, కాల్పుల‌కు పాల్ప‌డితే.. దీనిని బూచిగా చూపించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరాచ‌కం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోందంటూ.. జాతీయ స్థాయిలో మ‌రో ఉద్య‌మానికి బాబు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగ‌డుగునా సంయ‌మ‌నం అనే ప్ర‌తివ్యూహాన్ని అమ‌లు చేసింది. పోలీసులను నియంత్రించింది. దీంతో చంద్ర‌బాబు ఎత్తు చిత్త‌యింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి రాబోయే రోజుల్లో మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారో.. లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news