ప్రధాని హైదరాబాద్ పర్యటన వివాదం : క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్ 

ప్రధాని హైద్రాబాద్ పర్యటన పై వివాదమే లేదని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు.  రాజకీయ చర్చ కు ఆస్కారం ఇవ్వకూడదు అనే ప్రధాని ఎవరిని కలవడం లేదని ఆయన అన్నారు. ప్రధాని టూర్ లో సీఎం పాల్గొనే విషయం ఆత్మగౌరవం అంశం ఎలా అవుతుంది!? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు… ఒక పార్టీ కి అధ్యక్షుడు కూడా! అని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధాని పర్యటనకు వెళ్లడం లేదన్న ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షునితో సహా ఎవరికి ఈ పీఎం టూర్ లో అవకాశం లేదని అన్నారు. కేసీఆర్ పుట్టి మునుగుతుంధని గ్రహించే ఇప్పుడు ఆత్మగౌరవం అనే చర్చ మొదలు పెట్టారని ఆయన అన్నారు. గల్లీ ఎన్నికలు అనడం ద్వారా హైదరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు కించపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు అమిత్ షా టూర్ తప్పు పడుతున్న కేసీఆర్ వరదల్లో ఒక్క రోజు కూడా హైదరాబాద్ లో ఎందుకు తిరగలేదు అని ప్రశ్నించారు