ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు… అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

-

హైదరాబాద్: పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు దీంతో ఆలయ ప్రాంగణం రద్దీ నెలకొంది. ఆషాడమాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే సుఖశాంతులు కలుగుతాయని అంటున్నారు.

ఆలయంలోని క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో జోగిని భవిష్యవాణిని వినిపించనున్నారు. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా బోనాలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలను పెంపొందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బోనాల సందర్బంగా ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రలను పటిష్టం చేశామని తెలిపారు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శనీయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news