కబ్జా చేసిన తెరాస కార్పొరేటర్ అభ్యర్ధి, మంత్రికి చెప్పినా… చివరికి…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఒక తెరాస కార్పొరేటర్ అభ్యర్ధి వివాదంలో ఇరుక్కున్నారు. హయత్ నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామ తిరుమల్ రెడ్డి భూ కబ్జా చేశాడని బాధితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల్ రెడ్డి తన తమ్ముడు శ్రీధర్ రెడ్డితో కలిసి హయత్ నగర్ ఆర్ టి సి కాలనీలో ఉన్న తన 533 గజాల తన ప్లాట్ కబ్జా చేశాడని మా ప్లాటు మాకు ఇప్పించాలని వారు డిమాండ్ చేసారు.

చిన్న పిల్లలతో వచ్చి అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. కన్నీరు పెట్టుకున్న సదరు బాధిత కుటుంబం, మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్లినా మాకు న్యాయం జగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.