మిస్సింగ్ కేసు సుఖంతం.. ఇంటికి చేరిన లారా

-

హైదరాబాద్ లో అర్ధరాత్రి ఛాటింగ్ చేస్తున్నావని తిట్టినందుకు వెళ్ళిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేసు వీడింది. ఛాటింగ్ చేస్తుంటే తిట్టారని పేరెంట్స్ మందలించారని నాలుగు రోజుల క్రితం తట్టి అన్నారంలోని ఇంటి నుండి లారా వెళ్లి పోయింది. అయితే తన సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలి వెళ్ళడంతో ఆమె సెల్ ఫోన్ లేకపోవడం తో పోలీస్ లకు దర్యాప్తు కష్టంగా మారింది. అయితే కొద్ది సేపటి క్రితం క్షేమంగా ఇంటికి చేరుకుంది లారా.

ఆమె పుట్టిన నాటి నుండి అంటే 16 సంవత్సరాల్లో …ఒక్క రోజు కూడా ఇల్లు వదిలి వెళ్ళలేదని ఇప్పుడు బయటకు వెళ్లి 3 రోజులు అయింది..ఎక్కడుందో ? ఎలా వుందో ? అని ఆమె పేరెంట్స్ బాధ పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన వారు, వారి స్నేహితులు దాదాపు 30 బైక్ లతో లారా కోసం గాలించారు. అయినా ఆమె దొరకలేదు. కానీ తనంతట తానే ఇంటికి చేరుకుంది. తమ కూతురు క్షేమంగా ఇంటికి చేరడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్న లారాని కుటుంబ సభ్యులు బుజ్జగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news