ఎన్నారైలకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చిన కేంద్రం..ఎందుకంటే.!

భారత దేశం నుంచి ఉద్యోగరీత్య విదేశాలకు వెళ్లి అక్కడే ఆర్ధికంగా స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు వారి స్వస్థలంలో ఆస్తుల కొనుగోలులో ఆసక్తి చూపుతారు. సొంత ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధిలో భాగమవుతూ, భారతదేశం లో ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉప్పది కల్పిస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే మనదేశంలో ఏవైనా ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా,లేదా పరిశ్రమ స్థాపించాలన్నా పాన్ , ఆధార్ కార్డ్లు తప్పనిసరి. తాజాగా…

 

పాన్ కార్డు, అదార్ కార్డు ఉన్న ఎన్నరైలకి భారత ప్రభుత్వం ఒక సూచన చేసింది. వారి యొక్క పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో అనుసంధానం చేయమని, ఇలా అనుసంధానం లేని పాన్ కార్డులు  చెల్లుబాటు కావని ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.  ఇలా విదేశం లో స్థిరపడి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసే వారికీ భారతదేశం లో పాన్ కార్డు,ఆధర్ కార్డు లు వారి సొంత చిరునమా తో ఉంటాయి.

నిజానికి ప్రవాస భారతీయులకు ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు అంత తప్పనిసరి కాదు. కానీ  ఆ రెండు ఉన్నవారు మాత్రం తప్పకుండా అనుసంధానం చేసుకోవాల్సిందేనని భారత ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రకటన లోనే ఈ ప్రక్రియకు డిసెంబర్ 31 తేదిని చివరి తేదిగా నిర్ణయించింది. గతం లో ఇంతకు ముందు కూడా ఈ ప్రకటన చేసి అప్పుడు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, కానీ ఇంకా కొంతమంది పుర్తిచేయకపోయేసరికి గడువుపెంచి డిసెంబర్ 31 ని చివరి తేదిగా భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఈ విషయం లో ఆలస్యం చేస్తే మాత్రం ఎన్నారైలు భారత్ లో ఆర్ధిగా లావాదేవీలు జరపటం కష్టమని అధికారులు చెప్పారు.