చీర కట్టులో పద్ధతిగా కనిపించిన నివేదా థామస్.. కామెంట్స్ వైరల్..!

-

నివేద థామస్.. నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో అందచందాలతో యువతను బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. నిజానికి నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2016లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

ఈ సినిమా విజయం సాధించడంతో మళ్లీ నానితో నిన్ను కోరి సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా సక్సెస్ అందుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది అయితే ఆ తర్వాత ఈమె కథలో ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడంతో కొంతవరకు డిజాస్టర్లు చవిచూసింది.దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. అలా కొంతకాలం టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈమె ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రెడిషనల్ గా రెడీ అవుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె చీర కట్టుకొని అందంగా కనిపించింది ఈ ఫోటో బాగా వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజన్ మాత్రం చండాలంగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంత అందంగా తయారైన అమ్మాయిని చూసి ఆ నెటిజన్ ఎంత ఘోరంగా కామెంట్ పెట్టడం ఏంటి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. మొత్తానికైతే నివేద బ్లూ కలర్ సారీలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version