వెంటిలేటర్ పై లతామంగేష్కర్.. లతా మంగేష్కర్ పరిస్థితి విషమం..

-

గానకోకిల లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగానే ఉందని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతీత్ సందానీ మాట్లాడుతూ.. ఎడమ వైపు ఉన్న జఠరిక ఫెయిల్ అయిందని తెలిపారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వెంటిలేటర్ పై ఉంచి, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అయితే గత కొన్ని గంటలుగా ఆమె పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. డాక్టర్ల అబ్జర్వేషన్ లోనే మరికొన్ని రోజుల పాటు ఆమె ఉండాలని చెప్పారు.

లత వయస్సును (90 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని తాము ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని డాక్టర్ ప్రతీత్ తెలిపారు. హై డోస్ యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. కాగా, నిన్న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెయ్యికి పైగా హిందీ చిత్రాల్లో వేలాది పాటలను పాడిన లతా మంగేష్కర్ ను 2001లో భారత ప్రబుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.

Read more RELATED
Recommended to you

Latest news