రైతులపై లాఠీ ఛార్జ్ చేయలేదు..అది ఫేక్ ప్రచారమే అంటూ అదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సంచలన ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తిరిన రైతులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే… అన్నదాతల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన సంఘటనపై అదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సంచలన ప్రకటన చేశారు.
రైతుల పై లాఠీ ఛార్జ్ చేయలేదు, తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం.పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి తోపులాట జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో రైతులు విత్తనాలు కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు వారి డ్యూటీ చేశారని వివరించారు. అవును మీరు మీ కళ్ళతో చూసింది అబద్దం అని చెప్తున్నారు ఎస్పీ గౌస్ ఆలం. కాగా, గతంలో మేడారం జాతర సమయంలో ఓ ఎస్సైని కొట్టారు గౌస్ ఆలం.