ప్ర‌సాద్ ల్యాబ్‌లో రేపే లాఫ్ట‌ర్ చాలెంజ్ ఆడిష‌న్స్‌.. నవ్వించ‌గ‌లిగే వారికి చ‌క్క‌ని చాన్స్‌..!

-

వెండితెర‌పై న‌వ్వుల పువ్వులు పూయించే బ్ర‌హ్మానందం స్టైలే వేరు. మిగిలిన కామెడీ న‌టుల్లా ఆయ‌న కాదు. ఆయ‌న తెరపై క‌నిపించాడంటే.. ప్రేక్ష‌కులు ఆటోమేటిగ్గా న‌వ్వుతారు. అదీ.. ఆయ‌న శైలి. కానీ కొంత కాలంగా బ్ర‌హ్మికి సినిమావ‌కాశాలు తగ్గిపోయాయి. ఇక అంద‌రు వెండితెర న‌టుల్లాగే బ్ర‌హ్మానందం కూడా బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మా టీవీలో త్వ‌ర‌లో ది గ్రేట్ తెలుగు లాఫ్ట‌ర్ చాలెంజ్ పేరిట ఓ స్టాండ‌ప్ కామెడీ షో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. కాగా దీనికి బ్ర‌హ్మి వ్యాఖ్యాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఈ షో కోసం ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడిష‌న్స్ ను కూడా నిర్వ‌హిస్తున్నారు. అయితే రేపు మాత్రం హైద‌రాబాద్‌లో ఈ షోకు గాను ఆడిష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి.

బంజారాహిల్స్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో రేపు ఉద‌యం 10 గంట‌ల నుంచి లాఫ్ట‌ర్ చాలెంజ్ షోకు ఆడిషన్స్‌ను నిర్వ‌హిస్తారు. ఆస‌క్తి ఉన్న వారు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌చ్చు. కాగా ఈ షో ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో తెలియ‌దు కానీ, బ్ర‌హ్మి వ్యాఖ్యాత గా వ్య‌వ‌హ‌రిస్తాడు కాబ‌ట్టి, క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంద‌నే నిర్వాహ‌కులు కూడా చెబుతున్నారు. మ‌రి బుల్లితెరపై బ్ర‌హ్మి అదృష్టం ఏ విధంగా ఉండ‌బోతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news