అగ్ర రాజ్యం అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. విమాన యాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్ పోర్టు చుట్టూ 5 జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్లు సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.
అమెరికాలో బుధవారం నుంచి 5 జీ సేవలు ప్రారంభించినట్లు తెలియడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీ షెడ్యూల్ చేశాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాళ్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నాయని ట్విట్టర్ వేదికగా ప్రకటించాయి. 3.7 నుంచి 3.98 గీగా హెర్ట్జ్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5 జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరి వెరైజన్, ఏటీ అండ్ టీ రూ. లక్షల కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకున్నాయి.