ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో కూడా పెయిడ్ బ్లూటిక్ సర్వీసు ప్రారంభం కానున్నాయి. ట్విట్టర్ పద్ధతిని ఇప్పుడు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సైతం ప్రకటించింది. ఆదివారం ప్రకటనలో సంస్థ, మెటా వెరిఫైడ్ పేరుతో సబ్ స్క్రిప్షన్ ను తెస్తున్నట్టు వెల్లడించింది. ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లలో ఇది అమలు చేయాలని నిర్ణయించాం.
దీనికోసం వినియోగదారులు తమ అధికారిక ఐడిని ఉపయోగించి తమ అకౌంట్లోకి నీలిరంగు బ్యాడ్జ్ పొందవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో ఈ బ్లూ బ్యాడ్జ్ వినియోగదారుల ఆకౌంట్ కు అదనపు ఫీచర్లు, భద్రతను ఇస్తుందని తెలిపింది. దీనికోసం మెటా సంస్థ వెబ్ కోసం నెలకు 11.99 డాలర్లు, యాపిల్ ఐఓఎస్ లో నెలకు 14.99 డాలర్లుగా ధరలను నిర్ణయించింది. ప్రస్తుతం వెరిఫైడ్ విధానం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రారంభించనున్నట్టు మెటా పేర్కొంది.