లావా నుంచి లావా బేజ్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్లు ఇండియాలో ఈరోజు నుంచే ప్రారంభంకానున్నాయి. కంపెనీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన కొంత సమాచారం ఇప్పటికే లీక్ అయింది. ఇంకా ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఆఫర్ కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ఫొటోలను కంపెనీ షేర్ చేసింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అమర్చారు. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.10 వేలలోపే ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 7వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ గతంలోనే ప్రకటించింది. దీనికి “Time to shine. Time for Blaze.” అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఈ ఫోన్ డిఫరెంట్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. గ్రీన్, బ్లాక్, రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను చూడవచ్చు. 13 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ ఇందులో ఉండనుంది.
యూనిసోక్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లావా తన వినియోగదారులకు డోర్‌స్టెప్ రిపేర్ సర్వీసులను కూడా అందిస్తుంది. స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన సమస్యలను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకమైన వ్యక్తులను కూడా లావా నియమించుకుంది.. దేశవ్యాప్తంగా రెండు వేల మందిని మొదటగా నియమించాలన్నది లావా ప్లాన్. సాఫ్ట్వేర్ లేదా చిన్న హార్డ్‌వేర్ సంబంధిత సమస్యలైతే మీ ఇంటికే వచ్చి అప్పటికప్పుడు ఫోన్ రిపేర్ చేస్తారు. ఒకవేళ పెద్దదైతే మాత్రం ఫోన్ తీసుకుని, రిపేర్ చేసి, వినియోగదారుని ఇంటికే తిరిగి డెలివరీ చేస్తారు. సర్వీసుకు అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కష్టమర్స్‌ను ఆకట్టుకోవడానికి లావా మార్కెటింగ్ ఈవిధంగా చేస్తుంది. ఫోన్ లాంచ్ అయ్యేవరకూ ఫీచర్స్ కూడా పూర్తిగా లీక్ కాకపోవడం గమనార్హం.!