క్షమాపణలు చెప్పిన సోనూ సూద్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

-

తన సోషల్ మీడియా ఖాతాలకు వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయని నటుడు సోనూ సూద్ వెల్లడించారు. ‘19000 ఎఫ్‌బీ మెసేజ్‌లు.. 4812 ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు.. 6741 ట్విట్టర్ మెసేజ్‌లు.. సహాయం కోరుతూ ఈ ఒక్క రోజు వచ్చిన మెసేజ్‌లు ఇవి. సగటున ప్రతిరోజూ ఇంతే స్థాయిలో మెసేజ్‌లు అందుకుంటున్నా. ఇందులో ప్రతి ఒక్కరి మెసేజ్‌కు స్పందించడం దాదాపు అసాధ్యం. ఎవరి మేసేజ్‌కైనా స్పందించలేకపోతే క్షమించండని’ సోనూ ట్వీట్ చేశారు.

ఇకపోతే ఈ లాక్ డౌన్ కాలంలో వందలాది బస్సులను ఏర్పాటు చేసి వేల మందిని సొంత గ్రామాలకు చేర్చాడు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాడు సోనూ సూద్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రైతుకు ట్రాక్టర్ పంపించటం, ఉద్యోగం కోల్పోయిన అమ్మాయికి జాబ్ ఇప్పించటం వంటి సహాయలు చేసిన సోనూ సూద్ అందరి అభిమానాన్ని పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news