రూ.5,777కే లావా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు లావా భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఒక కొత్త ఎంట్రీ లెవ‌ల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌తోపాటు మ‌రో రెండు ఫీచ‌ర్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. లావా జ‌డ్‌61 ప్రొ, లావా ఎ5, ఎ9 పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. ప్రౌడ్లీ ఇండియ‌న్ స్పెషల్ ఎడిష‌న్ వేరియెంట్లుగా లావా వీటిని విక్ర‌యిస్తోంది. భార‌త జాతీయ ప‌తాకంలోని 3 రంగుల‌ను ప్ర‌తిబింబించేలా ఫోన్ల‌ను డిజైన్ చేశారు.

Lava Z61 Pro android smart phone launched

లావా జ‌డ్‌61 ప్రొ ఆండ్రాయిడ్‌ ఫోన్ ధ‌ర కేవ‌లం రూ.5,777 కాగా ఇది 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూపంలో ల‌భిస్తోంది. ఇందులో 5.45 ఇంచు హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 128జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, బ్లూటూత్ 4.2, వైఫై, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

లావా ఎ5 ఫీచ‌ర్ ఫోన్‌లో 2.4 ఇంచుల డిస్‌ప్లే, డ్యుయ‌ల్ సిమ్‌, 0.3 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 32జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, బ్లూటూత్‌, 1000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర రూ.1,333గా ఉంది.

అలాగే లావా ఎ9 ఫీచ‌ర్ ఫోన్‌లో 2.8 ఇంచుల డిస్‌ప్లే, 1.3 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 4ఎంబీ ర్యామ్‌, 32జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్‌, 1700 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర రూ.1574గా ఉంది. వీటిని ఆన్‌లైన్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొన‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news