Lavanya Tripati : సూర్యకాంతిలో అందాల ‘లావణ్యం’

-

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంది. నాకు పెళ్లి చేసేయండి నాన్న.. రాత్రిళ్లు ఒంటరిగా నిద్ర పట్టట్లేదు అంటూ అమ్మాయిల మనసులోని మాటను బయటకు చెప్పేసింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది.

ఆ తర్వాత భలేభలే మగాడివోయ్, యుద్ధం శరణం గచ్చామి, సోగ్గాడే చిన్నినాయన, దూసుకెళ్తా వంటి సినిమాలతో ఈ బ్యూటీ దూసుకెళ్లింది. ఓ దశలో టాలీవుడ్​లో టాప్ హీరోయిన్​గా నిలిచింది. ఈ బ్యూటీ ఇటీవలే హ్యాపీ బర్త్ డే అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సరైన ఆఫర్లు ఏం లేవు. అయినా ఈ భామకు క్రేజ్ తగ్గలేదు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్​గా ఉంటుంది లావణ్య. తాజాగా లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేసింది. ఇవి కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

యాష్ కలర్ డ్రెస్​లో కళ్లజోడు పెట్టుకుని కైపెక్కించే పోజులుతో ఈ భామ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు గుండెలు ఝళ్లుమంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్ల మరోసారి ఈ అందాల రాక్షసిపై మనసు పారేసుకుంటున్నారు. ఈ సొట్టబుగ్గల చిన్నదాని డింపుల్స్ అంటే ఎంతో ఇష్టమంటూ తెగ పొగిడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news