కేసీఆర్ కు దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలి – పవన్ కళ్యాణ్

-

కేసీఆర్ కు దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్​కు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చిరకాలం ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్.) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు పవన్‌ కళ్యాణ్‌. ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన శ్రీ కె.సి.ఆర్. గారికి సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పోస్ట్‌ పెట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news