స్కిన్ టోన్ కు సొంటిపొడి లావెండర్ ఆయిల్ సూపర్ ..సైంటిఫిక్ గా తేలిన నిజం

-

స్కిన్ టోన్ పెంచడానికి చాలా చిట్కాలు పాటిస్తుంటాం. ఏవేవో క్రీమ్స్, లోషన్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఫాలో అవుతాం. ఇలా చెప్పే బ్యూటీ టిప్స్ అన్నీ వాళ్లు వీళ్లు వాడి మీకు చెప్తారే తప్ప..సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవి చాలా తక్కువ ఉంటాయి. సైంటిఫిక్ గా అందాన్ని పెంచుకోవడానికి ప్రూవ్ చేసిన కొన్ని వాస్తవాలు మనం ఈరోజు తెలుసుకుందాం.
సొంటిపొండి స్కిన్ టోన్ పెంచడానికి చాలా బాగా పనికొస్తుందని సైంటిస్టులు నిరూపించారు. సొంటి అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అల్లాన్ని ఎండపెట్టినప్పుడు వచ్చేదాన్ని సొంటి అంటారు. అల్లం డ్రైగా అయ్యేసరికి కొన్ని మెడిసినల్ ప్రొపర్టీస్ పెరుగుతాయట. ఆ సొంటికొమ్ములు తెచ్చుకుని పొడి చేసుకుని జల్లిస్తే.. మెత్తగా పొడి వస్తుంది. సొంటి అంటే..గ్యాస్ సమస్యకు, జీర్ణకోశ సంబంధలకు వాడతారనే అందరికి తెలుసు. సౌందర్య సాధనంగా సొంటి ఉపయోగపడుతుందని 2014వ సంవత్సరంలో ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసర్చ్( Indian Institute Of spices Resarch- Kerala ) వారు నిరూపించారు. పరిశోధనలో ఏం చెప్తున్నారంటే..
రెండు స్పూన్ల సొంటిపొడి తీసుకుని నాలుగు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పులు అయ్యేవరకూ మరిగించాలట. సొంటిపొడిలో ఉండె మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ మరిగేసరికి వాటర్ లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ మరిగిన వాటర్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల లావెండర్ ఆయిల్ కలపాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో 4 గంటలపాటు పెట్టాలి. ఆ తర్వాత నుంచి వాడుకోవచ్చు. ఏ భాగాల్లో స్కిన్ టోన్ పెరగాలనుకుంటారో..అక్కడ కాటన్ తో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి..20 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమంలో ఉండే జింజిరాల్స్ అనే కెమికల్స్ స్కిన్ టోన్ పెంచడానికి బాగా పనికొస్తుందట. స్కిన్ సెల్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్స్ రానివ్వకుండా ఉపయోగపడుతుందని పరిశోధనలో పేర్కొన్నారు.
గాలికి, ఎండకు, పొల్యూషన్ కు స్కిన్ సెల్స్ ఎక్కువ డామేజ్ అవుతాయి. అప్పుడు స్కిన్ నిర్జీవంగా, గ్లో లేకుండా ఉంటుంది. ఈ సమస్యకు లావెండర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో లెవోనిల్, లెవనాల్ అనే కెమికల్స్ స్కిన్ కండీషన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయట. ఈ ఆయిల్ వాసనపీల్చటం, అప్లై చేయటం అనేది మంచి ఫలితాలను ఇస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఇక పైన చెప్పిన కాంబినేషన్ స్కిన్ టోన్ పెంచటాడనికి అద్భుతంగా పనిచేస్తుందని ప్రూవ్ అయింది..ఇంకా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావట. కెమికల్ ఎఫెక్ట్ లేదు. నాచురల్ గా ఉన్నవాటినే వాడుతున్నాం..దీన్ని డైలీ అప్లైయ్ చేస్తే..కొన్నిరోజులకే మంచి రిజల్ట్ ఉంటుంది.
దీంతోపాటు..వాటర్ కూడా బాగా తాగాలి..స్కిన్ హెల్తీగా ఉంచడానికి, డ్రై అవకుండా కాపాడటానకి వాటర్ ఎక్కువగా ఉయోగడుతుంది. డైలీ కనీసం నాలుగు లీటర్లు అయినా తాగుతుంటే..అందానికి, ఆరోగ్యానికి రెండింటికి మంచిదే. ఈ రెండు పద్థుతులు నెలరోజులు పాటిస్తే..మీరే ఆశ్యర్యపోతారు. కొంతమంది స్కిన్ టోన్ కోసం వేలకు వేలు ఖర్చుపెడతారు. అయినా వారికి ఆశించినంత ఫలితం ఉండదు. కాబట్టి ఒకసారి ఈ చిట్కా కూడా పాటించేయండి. సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు కాబట్టి డౌట్ లేకుండా ట్రై చేయొచ్చు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news