కఠిన పరిస్థితుల్లో కామ్ గా ఉండడం నేర్చుకోండిలా…

-

కామ్ గా ఉన్నవాళ్ళని చూసి అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారని అనుకుంటారు. సాధారణ పరిస్థితుల్లో కామ్ గా ఉండడం వేరు. పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న గుండె నిబ్బరం కోల్పోకుండా కామ్ గా ఉండడం వేరు. అలా ఉండడానికి సాధన కావాలి. దానికి కొన్ని అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఆకాశమనే జీవితాన్ని కష్టాలనే మేఘాలు కమ్మేసినపుడు కామ్ గా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే మేఘాలు శాశ్వతంగా ఆకాశాన్ని కప్పి ఉంచలేవని, ఉదయం అయ్యేసరికి మళ్ళీ ఆకాశం అందంగా కనిపిస్తుందని తెలుసుకోవాలి.

కఠిన పరిస్థితుల్లో కూడా కామ్ గా ఉండడం ఎలానో ఇక్కడ చూద్దాం.

నెమ్మదించు

ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురుకాగానే వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ముందుగా కామ్ అవ్వండి. అత్యవసరమయితే తప్ప వెంటనే స్పందించవద్దు.

దూరం జరగండి.

పరిస్థితి నుండి దూరం జరగాలి. అలా కొద్ది సేపు మాత్రమే. మీకు సమస్య వచ్చిందని తెలిసినపుడు మీ మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది.

శ్వాస

గట్టిగా శ్వాస తీసుకుని మళ్ళీ వదలండి. ఇలా రెండు మూడు సార్లు చేయండి.

సంగీతం

మీ మనసుకు నచ్చిన పాటలు వినండి. అది మీ మెదడు మీద భారం పడకుండా చేస్తుంది.

దృష్టి మరల్చండి

మీ సమస్య మీద నుండీ దృష్టి మరల్చండి. గదిలో కూర్చున్నట్లయితే అక్కడ నుండి బయటకు వచ్చేయండి.

మీ దృష్టికోణాన్ని మార్చండి

మీ ఇబ్బందిని అవతలి వారిదిగా భావించి దానికి ఎలాంటి సలహాలిస్తారో చూడండి.

మీ స్నేహితులకి కాల్ చేయండి.

కొన్నిసార్లు మనం చాలా పెద్దవనుకున్న సమస్యలు కూడా మరొకరితో పంచుకుంటే చిన్నవిగా తోస్తాయి. మిమ్మల్ని భయపెట్టే వారు కాకుండా మీ స్నేహితులకి కాల్ చేయండి. సమస్యని వారి కోణంలో వారెలా చూస్తున్నారో తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news