శ్యామ్ కె నాయుడుకు న‌టి సుధ స‌వాల్

-

ప్ర‌ముఖ సినిమాటో గ్రాఫ‌ర్ చోటా కె నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ న‌టి అయిన శ్రీ‌సుధ ఐదేళ్లు స‌హ‌జీవ‌నం చేసి, పెళ్లి చేసుకుంటాను అని న‌మ్మించి మోసం చేసిన విష‌యం తెలిసిన‌దే. త‌న‌కు న్యాయం చేయాలని సుధ పోలీస్ స్టేష‌న్‌ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విష‌యం విధిత‌మే. ఇక ఈ కేసులో శ్యామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అత‌ని నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, త‌న‌కు బెయిల్ ఇస్తేత‌న‌ను చంపేస్తార‌ని తెలుపుతూ సుధ సుప్రీం కోర్టులో పిటిష‌న్ పెట్ట‌గా.. తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిష‌న్ కొట్టి ప‌డేసింది. శ్యామ్ కి బెయిల్ మంజూరైంది.

ఇక ఈ విష‌యంపై న‌టి సుధ ఫేస్‌బుక్ ద్వారా స్పందించింది. నేను ఎదుర్కోవ‌డానికి రెడీగా ఉన్నాను. ఈ కేసును వ‌దిలేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. గ‌త మూడేళ్ల నుంచి ఈ కేసు న‌డుస్తోంది. శ్యామ్ కే నాయుడు త‌న‌ను చిత్ర హింస‌లు పెట్టి.. త‌న‌ను చంపాల‌ని చూస్తున్నాడ‌ని పెళ్లి చేసుకోమ‌ని అడిగినందుకు త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్టు సుధ తెలిపారు. ఈ కేసు ఎలాంటి మ‌లుపులు తీసుకోనుందో మ‌రి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news