ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విశాఖపట్టణం నగరాన్ని ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేసేందుకు… కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖ పట్నం ప్రత్యేక జోన్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కానుందని ప్రకటన చేశారు జి.వి.ఎల్. నరసింహారావు.
జోన్ ఏర్పాటు కు “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు” సిధ్దమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారని వెల్లడించారు జి.వి.ఎల్. నరసింహారావు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇదొక శుభవార్త అని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయం కోసం భవన నిర్మాణం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ అతి త్వరలోనే సాకారం కానుందన్నారు జి.వి.ఎల్. నరసింహారావు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కేవలం బిజేపి పార్టీ తోనే అభివృద్ది అని చెప్పారు జి.వి.ఎల్. నరసింహారావు.