Legends League Cricket Season 2 : కెప్టెన్లుగా పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌

-

క్రికెట్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న లెజెండ్స్ అంతా మళ్లీ బ్యాట్ పట్టుకొని తమ సత్తా చాటుతున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ అనే పేరిట ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఒక ఎడిషన్ కూడా పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 16 నుంచి మరో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మొత్తం నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి.

ఆదానికి గ్రూప్ సొంతమైన గుజరాత్ జేయింట్స్, జిఎంఆర్ స్పోర్ట్స్ వారి ఇండియా క్యాపిటల్స్, మనీపాల్ గ్రూప్ వారి మనీపాల్ టైగర్స్, బిల్వారా గ్రూపుకు చెందిన బిల్వారా కింగ్స్ అనే నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ నాలుగు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 32 కోట్లతో 59 మంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు. ప్లేయర్ల డ్రాఫ్ట్ లో మొత్తం 79 మంది ఆటగాళ్లు ఉంటారు. వారిని కొనుగోలు చేసేందుకు ఒక్కో జట్టుకు రూ.8 కోట్ల పర్స్ ఉంటుంది.

ఆ డబ్బు నుంచి వారు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకో మూడు రోజుల్లో ఫైనల్ స్క్వాడ్ లిస్ట్ ను ఫ్రాంచైజీలు అప్పగిస్తే వారు పర్స్ నుంచి మరికొంతమంది అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే గుజరాత్ జేయింట్సు జట్టుకు సేహ్వాగ్ కెప్టెన్ అని ప్రకటించారు. అలాగే ఇండియా క్యాపిటల్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మిగిలిన రెండు ఫ్రాంచైజీలు కూడా తమ తమ కెప్టెన్లను ప్రకటించాయి. మనీపాల్ గ్రూప్ వారి మనీపాల్ టైగర్స్.. కెప్టెన్‌గా హర్హజన్‌ ఎంపిక కాగా.. బిల్వారా గ్రూపుకు చెందిన బిల్వారా కింగ్స్ కెప్టెన్‌ గా పఠాన్‌ ఎంపికయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news