Health Tips : ఉదయం లేవగానే నిమ్మరసం విత్‌ తేనే.. అదుర్స్‌ చిట్కా్‌..

-

నిమ్మ రసం రుచిగా పుల్ల గానే ఉంటుంది.. కానీ అది చేసే మేలు అంతాఇంతా కాదు. వంటలకు మాత్రమే కాదు సౌందర్యానికి కూడా అదనపు అందం తెచ్చే శక్తి నిమ్మకాయలు ఉంది. అన్ని సీజన్లలో దొరికే నిమ్మ అన్ని సీజన్లకు తగ్గట్లు శరీరానికి వేలు చేస్తుంది. తేనెలో లభించే కార్బోహైడెట్‌లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలానే బాగా కండరాలను దృఢంగా చేస్తుంది. అయితే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో ఒక చెంచా తేనే మిక్స్ చేసి, రెండు చెంచాలు నిమ్మ రసం జోడించి ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారు. నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మలబద్దకం కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతాయి. మరియు గొంతునొప్పి, జలుబు, ఇన్పెక్షన్‌ వంటి ఆరోగ్య సమస్యలకు నిమ్మరసం మంచి ఔషధం. చాలా మంది తేనే నిమ్మరసం కేవలం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అనుకుంటారు.

Lemon Juice Benefits In Telugu|నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి ఇంత మంచిదా|Nimma Rasam Telugu|Health Tips - YouTube

కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. తేనే, నిమ్మరసం, మొటిమల లేని మొహాన్ని పొందటానికి మంచి ఇంటి చిట్కా ప్రజలకు పొద్దునే రసాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తాగటం వల్ల చర్మంలో సహజ కాంతి వస్తుంది. తేనె కలిపిన నిమ్మరసాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల వలన వచ్చే అంటు వ్యాధులని శరీరాన్ని కాపాడుతుంది. నిమ్మరసంలో తేనే కలపటం వల్ల శరీరంలోని పేగులకు, కదలికలను క్రమబద్ధం చేస్తుంది. దీనితో పాటు ప్రతిరోజు పొద్దున్నే దీన్ని తాగడం వల్ల కొవ్వు కరిగి మీరు ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఫీల్‌ అవుతారు. తేనే సహజంగా శక్తిని పెంచే పదార్థం.. పంచదార కన్నా తినడానికి చాలా రెట్లు ఆరోగ్యకరమైనది. ఇందులో ఉన్న బాక్టీరియా చంపే లక్షణాలు శరీరములో శక్తిని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news