మహారాష్ట్రలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రె శివసేన, ఎన్సీపీ (శరద్ ) కలిసి బరిలోకి దిగుతాయని శరద్ పవార్ స్పష్టం చేసారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్ఐ) కూటమిని గద్దె దించడమే లక్ష్యమని మీడియాతో వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 17 సీట్లు రాగా శరద్ మిత్రపక్సాలకు 31సీట్లు వచ్చాయి.
కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.