నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ సీఎల్ లో ఉద్యోగ అవకాశాలు..!

-

మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్. సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు హెచ్సీఎల్ కంపెనీలో ఇంటర్న్షిప్ తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పార్టీనేతలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023, 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఒకేషనల్, సీఈసీ, హెచ్ఎసీ, బైపీసీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉండాలన్నారు. సంవత్సరం పాటు శిక్షణ కాలంలో మధురైలో మూడు నెలలు, చెన్నెలో 9 నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

మొదటి మూడు నెలల తర్వాత ప్రతి నెలా రూ.10 వేల గౌరవ వేతనం, శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి కనీసంగా రూ.లక్ష 70 వేల ప్యాకేజీతో కూడిన వేతనం అందుతుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 8367608888, 9553910733 నెంబర్లకు కానీ, మంగళగిరి డాక్టర్ ఎమ్మెస్సెస్ భవన్లో కానీ సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఈ పని చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news