SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి సూపర్ ఆఫర్స్..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో కస్టమర్స్ సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా /SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా /SBI

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మరోసారి యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో కస్టమర్స్ ఈ ఆఫర్స్ ని వినియోగించుకుని డబ్బులని సేవ్ చేసుకోవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇక ఆ ఆఫర్స్ గురించి చూసేస్తే.. ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్ జూలై 4న ప్రారంభమైంది. ఈ సేల్ జూలై 7 వరకు అందుబాటులో ఉంటుంది.

టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు లభిస్తోంది. అలానే అపోలో పై 20 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటుగా మరి కొన్ని ఆఫర్లు కూడా వున్నాయి. వాటి కోసం కూడా చూసేస్తే…
ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. టాటా క్లిక్‌లో అయితే రూ.300 తగ్గింపు లభిస్తోంది. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు ఉంది.

ఓయో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. కాబట్టి ఈ అదిరే ఆఫర్స్ ని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ఉపయోగించుకుని బాగా బెనిఫిట్ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news