కొత్తగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు అయితే మీకోసం ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ఎల్ఐసీ నుంచి యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీతో అదిరిపోయే లాభాలు కూడా లభిస్తాయి. దేశీ ప్రముఖ దిగ్గజ బీమా రంగ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎల్ఐసీ అనేక రకాల పాలసీలు అందిస్తోంది. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వారి అవసరాలకు అనుగుణంగా ఎల్ఐసీ పాలసీలు తీసుకోవచ్చు.
ఎల్ఐసీ అందించే అనేక పాలసీల్లో జీవన్ అక్షయ పాలసీ అని ఒకటి ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని అనుకునేవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత ఈ పాలసీ తీసుకున్నవారు , ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు పొందొచ్చు. లేదా మొత్తం పెన్షన్ ఒక్కసారే తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు దాదాపు 10 రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇది సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. 30 నుంచి 85 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి లోన్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు.
ఈ ఎల్ఐసీ జీవన్ అక్షయ పాలసీ తీసుకున్న వారు ఏడాది నుంచే రూ.19,000 ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. అయితే దీని కోసం మీరు రూ.40 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇంత భారీ మొత్తం ఒకేసారి అంటే చాలా కష్టం. అందుకే ఈ పాలసీని రూ. లక్ష చెల్లించి కూడా తీసుకోవచ్చు. పెన్షన్ డబ్బులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పొందొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ జీవన్ అక్షయ పాలసీ తీసుకోవడం వల్ల పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందుకోవచ్చు. పాలసీదారుడు మరణించిన తర్వాత ఎటువంటి పెన్షన్ లభించదు. అలాగే పెట్టిన డబ్బులు కూడా మళ్లీ తిరిగి రావు.