మళ్ళీ తెరపైకి దిశ ఎన్ కౌంటర్ చిత్రం…!

మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ను ఆశ్రయించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని హైకోర్టు లోని జ్యుడీషియల్ కమిషన్ కు విన్నవించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు…ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని హైకోర్టు ను కోరారు దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి..

ఎన్ కౌంటర్ గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు హైకోర్టు లోని జ్యుడీషియల్ కమిషన్ ను ఆశ్రయించారు. ఈ చిత్రంలో తమ వాళ్ళను విలన్స్ గా పెట్టి చెడు గా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ చిత్రం తీయడం వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛ కు భంగం కలుగుతోందన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు..చనిపోయిన వారిని ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్ కు విన్నవించారు. వెంటనే రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కమిషన్ ను కోరారు.