LIC: రూ.165 పొదుపుతో రూ.37 లక్షలు…!

-

చాలా మంది ఈ రోజుల్లో డబ్బులని పొదుపు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి నచ్చినట్టుగా పొదుపు పథకాల్లో డబ్బులు పెట్టుకుంటూ వెళ్తే అదిరే లాభాలని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బీమా సంస్థలు ఉన్నాయి. వివిధ పేర్లతో వివిధ పాలసీలను అందిస్తున్నాయి. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటే మనీ బ్యాక్ పాలసీ తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత భారీగా డబ్బులని పొందవచ్చు. దీని పేరు ధన రేఖ పాలసీ.

Life Insurance Corporation

ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ఒకేసారి ప్రీమియం కట్టి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ కూడా వుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు చేరవచ్చు. పాలసీ టర్మ్ 20, 30, 40 ఏళ్లుగా ఉంటుంది. బీమా మొత్తం ఆధారంగా కూడా ప్రీమియం మారుతూ ఉంటుంది. 30 ఏళ్లు వాళ్ళు 40 ఏళ్ల టర్మ్‌తో రూ. 10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని అనుకుంటే..
నెలవారీ ప్రీమియం రూ. 4950 వరకు పడుతుంది.

రోజుకు రూ. 165 పొదుపు చేయాల్సి ఉంటుంది. 20వ సంవత్సరంలో రూ. 2 లక్షలు వస్తాయి. 25వ సంవత్సరంలో రూ. 2 లక్షలు.. 30వ సంవత్సరంలో రూ. 2 లక్షలు వస్తాయి. అలానే 35వ సంవత్సరంలో రూ. 2 లక్షలు వస్తాయి. ఇక 40 వ సంవత్సరంలో రూ. 29 లక్షల వరకు మెచ్యూరిటీ డబ్బులు కింద పొందవచ్చు. మొత్తంగా రూ. 37 లక్షలు దాకా పొందవచ్చు. 30 ఏళ్లు ఉన్నప్పుడు మీరు పాలసీ తీసుకుంటే 49 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. పాలసీ టర్మ్ 40 ఏళ్లు ఉన్నా ప్రీమియం టర్మ్ మాత్రం 20 ఏళ్లు. ప్రీమియం టర్మ్ అయ్యాక మీకు డబ్బులు వెనక్కి వస్తాయి. 30 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే.. 15 ఏళ్ల పాటు ప్రీమియం పే చెయ్యాలి. ఇంకా 20 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news