లైక్ ఫాదర్ లైక్ సన్.. ఎక్స్ ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ మరీ ఎక్కువ. స్టార్ హీరోలు వెండితెరపై చూపించే హావాభావాలు చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతుంటారు. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు. సిగ్గుపడుతూ.. చిన్నగా స్మైల్ ఇస్తుంటే అమ్మాయిలు మనసు పారేసుకుంటారు. పవన్ కెరీర్ లోనే పేరుపొందిన చిత్రాల్లో ఒకటైన ‘ఖుషి’లోని పలు సన్నివేశాలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. నటి భూమికతో కొంటెగా మాట్లాడుతూ సిగ్గుపడటం, ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం అభిమానులు కొత్తదన్నాన్ని అందిస్తూనే ఉంటాయి.

pawan kalyan-akira
pawan kalyan-akira

తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా అచ్చం తండ్రిలానే హావాభావాలు పలికించి అభిమానులను ఆకర్షించాడు. మెగా వారసురాల్లో ఒకరైన నిహారిక వివాహ వేడుకలు ప్రస్తుతం ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్, తనయుడు అకీరా చేరుకున్నారు.

పవన్ కళ్యాణ్ రాకతో మెగా-అల్లు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ నిహారిక-చైతన్యలకు అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ అకీరాతో కలిసి తన కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లతో కలిసి వరుసగా ఫోటోలు దిగారు.

నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబ సభ్యుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అందులోకి ఒక ఫోటోలో అకీరా అచ్చం తన తండ్రిలా సిగ్గు పడుతున్నట్లు ఉన్న ఫోటో ప్రస్తుతం అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఖుషీ సినిమాలో భూమికతో మాట్లాడుతూ.. సిగ్గుపడుతున్న సన్నివేశంలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు అకీరా సెమ్ టూ సెమ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘లైక్ ఫాదర్ లైక్ సన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, బుధవారం నిహారిక-చైతన్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news